Monday, 28 October 2013

the beginning

               కాలం మారింది , ఋతువులు  మారుతున్నాయి, ప్రదేశాలు మారుతున్నాను , మనుషులు మారుతున్నారు .  కొత్త పరిచయాలు పాత పరాజయాలు మిగిల్చిన చేదు అనుభావలాకు ఉరటనిస్తున్నాయి.
                                                 ఎన్ని మారినా , ఎన్ని వచ్చినా,   నా మనసు మారదు. ఆ మనసున దాగిన మనిషి కూడా మారదు.  ఆమె కోసం వేచి చూసే సమయం కుడా ఆగదు.
                                         వైజాగ్ నగరానికి వచ్చి 5 సంవత్సరాలు అవుతోంది. కాని నాకు మాత్రం ఈ విశాఖపట్నం ఎప్పుడూ  పాతగా అనిపించలేదు. ఈ మహానగరం లో తనతో పాటు తిరగని చోటు లేదు, చూడని సినిమా లేదు. ఎక్కడికి వెళ్ళినా తన జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. కళలు కుడా కనడం మానేసాను , కళ్ళలో తన రూపమ్ ఎక్కడ చేదిరిపోతుందేమో అని.
                                           పుట్టిన మనిషి ఎవరైనా మరణిస్తాడు, వికసించీ ఎ పువ్వు అయినా వాడిపోతుంది.
అలాగే ప్రతీ కదా కి ఒక ముగింపు ఉంటుంది. ఎన్నో కధలు చూసాను , ఇంకెన్నో కధలు విన్నాను. కాని నాకు కూడా ఒక కధ ఉంటుంది, దానికి కుడా ఒక ముగింపు  ఉంటుంది అని ఎ రొజూ అనుకోలేదు. బహుసా నా కధ  కి ముగింపు నేను ఒంటరినై నిరీక్షించడమే అయి ఉంటుంది ..............

*** సాయింత్రం 5:30 అవుతోంది. వర్షం పడేలా ఉన్నట్లుంది, rk beach  మొత్తం ఆహ్లాదంగా ఉంది , చిన్న పిల్లలు ఇసక కోటలు  కట్టుకుంటున్నారు , ముసలి వాళ్ళు వాళ్ళ అలనాటి చిలిపితనాన్ని గుర్తుకు తెచుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు  , ప్రేమికులు ఒకరి భుజం పై ఒకరు వాలి అలా ఊహల లోకం లో విహరిస్తున్నారు.
అలాగే ఒక రాయిపై  కూర్చొని ఇదంతా చూస్తూ అలా తన గతం లోకి వెళ్ళిపోయాడు ఆఆ కుర్రవాడు .....
...
[ 3 సంవత్సారాల క్రితం ,
ఇదే  RK BEACH ... ]
                             
                                     " హెల్లో, నా పేరు సందీప్ , gitam  కాలేజీ లో b.tech  2nd year చదువుతునా . మీ పేరు తెలుసుకోవచ్చా ? " ఏమాత్రం జడవకుండా హుందా గా ఆ అమ్మాయి కళ్ళలోకి సూటి  గా చూస్తూ అడిగాడు ఆ కుర్రాడు. మరీ అంత పొడుగు ఏమి కాదు కాని సన్నగా ఉన్నాడు . మొఖం లో తరిగిపోని కల ఉంది ...
తలని ఎ మాత్రం పక్కకి కూడా తిప్పకుండా ఆఅ అమ్మాయి ఎదురుగా
 నిల్చొని ఆ నీలి రంగు కళ్ళలోకి  అలా చూస్తూ సమాధానం కోసం నిలుచొని ఉన్నాడు.
                                          చిన్న పిల్లలాంటి అమాయఖమైన   ముఖం తో, చాల చిరాకు కోపం నిండిన కళ్ళతో ఆ కుర్రాడిని పైనుంచి కింద వరుకు ఒకసారి చూసి అక్కడనుంచి లేచి వెళ్లిపోయింది తను. ఎ మాత్రం సిగ్గుపడకుండా అలానే చూస్తూ ఉన్నాడు సందీప్ , ఏదో ప్రపంచ యుద్ధం ఆపినట్టు మురిసిపొథూ ..
                    అల రోడ్డు మీదకి వెళ్లి తన స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది .. కొద్దిగా దూరమ్ వెళ్లి మల్లి వెనక్కి తిరిగి చుసిన్ధి....      {to be continued }
.............................................................................................................................. Si.Cho
                                                                                                             ( SIddhartha CHOkkakula)